మే చివరికి కరోన కనికరించవచ్చు

కరోనా కట్టడి కోసం ప్రపంచమంతా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తోంది. కరోనా మాత్రం కనికరించడం లేదు. వుహాన్ లో పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు ఎలా వ్యాప్తి చెందింది? ఏయే దేశాల్లో ఎలా విరుచుకు పడింది ? ఎన్ని రోజుల్లో ఎంత పెరిగింది ? కరోనా ఎన్ని రూపాలు సంతరించుకుంది ? ఈ అంశాలన్నింటి పై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి . ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు . సింగపూర్ పరిశోధకులు గణిత శాస్త్ర ఆధారంగా ఒక లెక్క వేశారు. జర్మనీ లో వైరస్ ల వ్యాప్తి పరిశోధనల ఆధారంగా మరో లెక్క వేశారు. కరోనా మనతోనే కాపురం చేయబోతోందని కొందరు , ఈ ఏడాది చివరి నాటికి తగ్గుముఖం పడుతుందని మరికొందరు చెబుతున్నారు . 
సరే వీళ్లందరి లెక్కలు ఎలా వున్నా ....  నేను ఒక లెక్క కట్టాను. నా లెక్క ప్రకారం వచ్చే నెల అంటే మే నెలాఖరుకి మన దేశంలో కరోనా తగ్గు ముఖం పెట్టె అవకాశం ఉంది. చైనా నుంచి ఇటలీ, స్పెయిన్ , ఫ్రాన్స్ , జర్మనీ తదితర యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి , ఎన్ని రోజుల్లో ఏ విధంగా పెరిగింది , ఎంత తీవ్రంగా ఉంది , ఎలా తగ్గు ముఖం పడుతుంది లెక్కలు వేసి చుస్తే  మనం ఒక అంచనాకు రావచ్చు . అయితే కేవలం యూరప్ లెక్కల తోనే ఒక అంచనాకు రాలేము. ఆసియా దేశాల్లో కరోనా వ్యాప్తిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక అంచనాకు వచ్చాను. సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా , మలేషియా , కజకస్తాన్ , ఉజ్బెకిస్తాన్ , జపాన్, వియత్నాం  , శ్రీలంక , పాకిస్తాన్ తదితర దేశాల పరిస్థితి కూడా పరిశీలించిన తర్వాత మన దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి పై ఒక అంచనాకు వచ్చాను. 


నా లెక్క మే చివరికి ఇండియాలో కరోనా తగ్గుముఖం పడుతుంది.  ఆ తర్వాత  అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదైన అవి ఏమాత్రం భయం చెందాల్సిన అవసరం లేనివే.